జెడ్పిటిసికి గోడు వెల్లబోసుకున్న ఇందిరమ్మ కాలనీ మహిళలు శంకరపట్నం మార్చి 01 ప్రజాపాలన రిపోర

Published: Thursday March 02, 2023
శంకరపట్నం మండల కేంద్రంలో బుధవారం జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మైపాల్ ఓ కార్యక్రమానికి హాజరవ్వగా అక్కడికి చేరుకున్న ఇందిరమ్మ కాలనీ మహిళలు మండల ప్రజా ప్రతినిధులను చుట్టిముట్టిన కాలని వాసులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాసిల్దార్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ఈ కాలనీలో ఇప్పటివరకు సీసీ రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం లేక కాలనీ అపరిశుభ్రమైన వాతావరణం నెలకొని ఉందని, గ్రామ పంచాయతీ చెత్త బండి కూడా రాదని, కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు  ప్రజా ప్రతినిధులకు గోడు వెళ్ళబోసుకున్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన జెడ్ బి సి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి కాలనీని క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే ఈ కాలనీకి సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని స్థానిక ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు చల్ల సునీత, బండ భాగ్య, వాసాల స్వరూప, అఫ్జల్ బి, స్వరూప, కుతిల, గుర్రం సమ్మయ్య, ఎండి చాదాబీ, చల్లూరి ఆనందం, చల్ల మహేష్, తదితరులు జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మైపాల్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  ఎంపీడీవో  బషీరుద్దీన్, గ్రామ కార్యదర్శి  గురువయ్య, టిఆర్ఎస్ నాయకులు సతీష్ రెడ్డి, బొజ్జ కోటి, కల్లూరి పోచయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.