రాయికల్ లో కోటి యాభై లక్షలతో మినీ ట్యాంక్ బండ్ మరియు పార్కు నిర్మాణం.

Published: Friday April 29, 2022

రాయికల్, ఏప్రిల్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) : రాయికల్ మున్సిపల్ గా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం 25 కోట్ల నిధులను విడుదల చేసింది. దానిలో భాగంగా రాయికల్ పట్టణంలో పెద్ద చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్ గా, పార్కు నిర్మాణానికి ఒక కోటి 50 లక్షలు మంజూరై, టెండరు ప్రక్రియ కూడా పూర్తయింది .అట్టి పెద్ద చెరువు కట్ట, పార్కు ప్రదేశాన్ని మున్సిపల్ చైర్మన్ అధికారులు, వార్డు కౌన్సిలర్ లు, నాయకులతో పరిశీలించి మూడు నాలుగు రోజులలో పని మొదలు పెట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ ను రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు ఆదేశించారు. పెద్ద చెరువును పరిశీలించిన వారిలో నీటిపారుదల శాఖ డివిజనల్ ఇంజనీర్ భాస్కర్, అసిస్టెంట్ ఇంజనీర్ ధనుంజయ్, ఏనుగు మల్లారెడ్డి, మోర రామ్మూర్తి, పట్టణ వార్డు కౌన్సిలర్ లు ఎలిగేటి అనిల్, కల్లెడ ధర్మపురి, తదితరులు పాల్గొన్నారు