*పైండ్ల గోపాల్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంబిన, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్*

Published: Tuesday January 03, 2023

-క్రీడా పోటీల వలన గ్రామీణ ప్రాంత యువకుల ప్రతిభను వెలికి తీయవచ్చు.

చేవెళ్ల,జనవరి2,(ప్రజాపాలన):-

క్రీడా పోటీలలో పాల్గొనడం ద్వారా యువకుల మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపడతాయని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.
చేవెళ్ల మండల కేంద్రంలోని కెవిఆర్ గ్రౌండ్ లో సోమవారం పైండ్ల గోపాల్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... క్రీడాకారులు గెలుపోవటములను సమానంగా స్వీకరించాలని క్రీడాకారులకు సూచించారు. ఓటమి చెందినపుడు కుంగిపోకుండా గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలన్నారు. ఇలాంటి టోర్నమెంట్లలో పాల్గొనడం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారుల ప్రతిభ బయటపడుతుందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టోర్నీ నిర్వహిస్తున్న ఫైండ్ల మధుసూదన్ రెడ్డి బ్రదర్స్ ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రదీప్, డిసిసి మాజీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి, చింపులా సత్యనారాయణ రెడ్డి, సున్నపు వసంతం, భీమ్ భరత్, బండారు ఆగిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, వీరేందర్ రెడ్డి, మధుసూదన్ గుప్తా, పెంటయ్య గౌడ్, గంగి యాదయ్య, జూకన్నగారి శ్రీనివాస్ రెడ్డి,  శ్రీనివాస్ గౌడ్, నత్తి కృష్ణారెడ్డి, మద్దెల శ్రీనివాస్, దర్శన్ రెడ్డి,  ప్రకాష్ గౌడ, మహిపాల్ రెడ్డి,  మల్లేష్ యాదవ్, యాలాల మహేశ్వర్ రెడ్డి, జంగన్ గౌడ్, రవీందర్ గౌడ్, మహ్మద్ కలీమ్, మాణిక్యం, సుశాంత్, నరేందర్ రెడ్డి, భాజాపా చేవెళ్ల మండల ప్రధాన కార్యదర్శి అత్తిలి అనంత్ రెడ్డి, నిర్వాహకులు పైండ్ల జితేందర్ రెడ్డి, కొండల్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఆనంద్, చాంద్ పాషా, శివారెడ్డి, బద్రి,  తదితరులు పాల్గొన్నారు.