తడిసిన వరి ధాన్యం ప్రభుత్వమే కొనాలి : డిసిసి అధ్యక్షులు టి.రామ్మోహన్ రెడ్డి

Published: Thursday June 03, 2021

పరిగి, జూన్ 02, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా  కుల్కచర్ల మండల పరిధిలోని బండవేలకిచెర్ల గ్రామములో వరి కొనుగో కేంద్రాన్ని రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఉన్నత అధికారులతో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఫోన్లో రైతులు పడుతున్న సమస్యల గురించి వివరించారు. అదేవిధంగా సంచులు లేక వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలిస్తు వెంటనే సంచులు ఇవ్వాలని తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బి.ఆంజనేయులు గ్రామ సర్పంచ్ శిరీష లక్ష్మా రెడ్డి, ఎమ్ పి టి సి ముకుంద ఆనందం, నాయకులు గోవర్ధన్ రెడ్డి, మైపాల్ రెడ్డి రైతులు పాల్గొనడం జరిగింది