జ్యోతిరావు పూలే 131 వర్ధంతి వేడుకలు

Published: Monday November 29, 2021
బాలాపూర్, నవంబర్ 28, ప్రజాపాలన (ప్రతినిధి) : స్త్రీలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని భాహుగుణ నాయక్ పేర్కొన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ శ్రీ హిల్స్ కాలనీ లోని పార్కుస్థలం దగ్గర మహనీయుని జ్యోతిరావు పూలే 131 వ వర్ధంతినీ పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో భుహుగుణ నాయక్ మాట్లాడుతూ.... సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడైన జ్యోతిరావు పూలే, స్త్రీల కు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన అని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గౌడ్, జగన్ చారి, బాల నారాయణ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.