బేగంపేటలో 'క్లబ్ టాలీవుడ్' పబ్ ప్రారంభం

Published: Friday December 03, 2021
హైదరాబాద్(ప్రజాపాలన ప్రతినిధి) : సువిశాలమైన స్థలంలో, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బేగంపేటలోని కంట్రీ క్లబ్ ఆవరణలో 'క్లబ్ టాలీవుడ్' పేరుతో రూపొందించిన నూతన పబ్ ను ప్రముఖ మోడల్స్ ప్రారంభింపజేసినట్లు పబ్ నిర్వాహకుడు రాము తెలిపారు. సినిమా షూటింగ్ లకు అనుకూలంగా, ఐటీ ఉద్యోగులు, పలు సంస్థలు ఈవెంట్స్, కిట్టీ పార్టీలు, పుట్టినరోజు వేడుకలు చేసుకునేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రతీ రోజు రక రకాల డీజే నైట్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు, డిజే నిర్వహణలో ఎంతో అనుభవం కలిగిన వారితో లైవ్ బ్యాండ్ మ్యూజిక్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 25 రకాల కాక్ టైల్స్ అనుభవంగల చెఫ్ లచే రుచికరమైన వెజ్, నాన్వెజ్ వంటకాలు అందుబాటులో ఉంటాయన్నారు.