ఆరుట్ల చెర్వు కట్టపై బీటీ రోడ్డు పనులు మొదలు పెట్టాలి వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయక

Published: Monday August 29, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 28ప్రజాపాలన ప్రతినిధి మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ ఆ రుట్ల చెర్వు కట్ట లాస్ట్ నుండి ప్రభుత్వ దవాఖాన వరకు బీటీ రోడ్డు మరమ్మతుల కోసం.ప్రభుత్వం    నిధులు మంజూరు చేసింది స్థానిక ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలని స్థానిక ప్రజా ప్రతినిధులలతో కలిసి శిలా పాలకం ప్రారంభించటం జరిగింది శిలా పాలకం ప్రారంభించి 5 నెలలు గడుస్తున్నా రోడ్డు మరమ్మతు పనులు మొదలు పెట్టలేదు రోడ్డు పనులు మొదలు పెడుతున్నాము అని చెప్పు కోవటానికి రోడ్డు ప్రక్క నుండి గుంతలు తీసి కంకర పోశారు తప్ప ఇంకా ఎలాంటి పనులు మొదలు పెట్టలేదు అన్నారు గుంతలు తీసి కంకర పోసేటప్పుడు ఫొటోలకు పోజులు ఇచ్చిన ప్రజా ప్రతినిధులు రోడ్డు పనుల గురించి పట్టించుకోరా చెర్వు కట్టపై రోడ్డు మొత్తం దెబ్బ తిని గుంతలుపడి రోడ్డుమొత్తం ప్రమాదకరంగా మారడంతో వాహన దారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చెర్వు కట్టపైన ఏదైనా వాహనం అదుపు తప్పింది అంటే ఒక పక్కా చెర్వు ఇంకో పక్క పెద్ద లోయ ద్విచక్ర వాహన దారులు మాత్రం రాత్రి అయింది అంటే ఎక్కడ పడి పోతామో అని ఆందోళన చెందుతున్నారు శిలా పాలకం ప్రారంభించి 5నెలలు దాటినా ఎందుకు రోడ్డు మరమ్మతులు చేయటం లేదు అధికారుల నిర్లక్ష్యమ కంట్రాక్ట్ నిర్లక్ష్యమ అర్థం కావటం లేక పేరుకు మాత్రం రోడ్డు వెయిస్తున్నాం నిధులు మంజూరు చేసాం అని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు గొప్పలు చెప్పటం తప్ప చేసింది ఏమీలేదు అన్నారు వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అరుట్ల చెర్వు కట్టపై వెంటనే బీటీ రోడ్డు పనులు మొదలు పెట్టేలా చర్యల తీసుకొని రోడ్డు పనులు మొదలు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేస్తున్నాం