చిరు వ్యాపారులకు అద్దెల నుండి విముక్తి !

Published: Tuesday March 08, 2022
మధిర మార్చి 7 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం నాడు విలేకరులతో సమావేశంలో మున్సిపాలిటీల్లో చిరు వ్యాపారుల నూతన దుకాణ సముదాయం ఏర్పాటుకు ప్రతిపాదనలు.  ఆనందోత్సవంలో చిరువ్యాపారులు. 20 ఏళ్ల నాటి సమస్యకు పరిష్కార మార్గాలు. మధిర మున్సిపాలిటీలో గత 20 సంవత్సరాల నుండి ఆర్ ఓ బి కింద మెయిన్ రోడ్ లో గతంలో కొంత మంది ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి చిరు వ్యాపారం చేసుకునేందుకు గత రెండు రోజులు క్రితం ట్రైనీ కలెక్టర్ రాహుల్ మధిర వచ్చి మున్సిపాలిటీల్లో ఆర్ ఓ బి కింద మెయిన్ రోడ్ లో బడ్డీ కొట్లు ఏర్పాటు చేసుకున్న వారి వివరాలు సేకరించారు అయితే ఆ క్రమంలోనే కొంతమంది అద్దెకు ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు ఈ క్రమంలో భాగంగా చిరు వ్యాపారులకు వాళ్లందరికీ నూతనంగా దుకాణాలు ఏర్పాటు చేసి వారికి జీవన ఉపాధి కల్పించే దిశగా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక మున్సిపల్ కమిషనర్ రమాదేవి చైర్ పర్సన్ మొండితోక లతా జయాకర్ తాసిల్దార్ రాజేష్ టౌన్ ప్లానింగ్ అధికారి రమేష్ ఈ విషయం పై కసరత్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరువ్యాపారులు తెలంగాణ ప్రభుత్వం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ మా చిరు వ్యాపారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పించడం వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు చిరు వ్యాపారుల సంఘం రుణపడి ఉంటుందని పేర్కొంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని తాసిల్దార్ ఆఫీస్ ఎదుట మెయిన్ రోడ్ కాంప్లెక్స్ ఏరియాలో 100 బడ్డీ కొట్లు తాసిల్దార్ కార్యాలయం ఏరియాలో 100కు పైగా జిల్లా కలెక్టర్ కి ప్రతిపాదనలు పంపినునట్లు కమిషనర్ రమాదేవి తెలిపారు. 20 ఏళ్లనాటి సమస్యకు భరోసా కల్పించిన తెలంగాణ ప్రభుత్వం చిరు వ్యాపార సంఘం వారి ఆధ్వర్యంలో : పాలకవర్గం చైర్మన్ కమిషనర్ కు చిరు వ్యాపారస్తులు సభ్యులందరూ కలిసి కృతజ్ఞతలుఅభినందనలు తెలిపారు