కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే అన్నదాతకు ఇబ్బందులు ఎమ్మెల్యే సంజయ్

Published: Thursday November 25, 2021

జగిత్యాల, నవంబర్ 24 ( ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల రూరల్ మండల హబ్సిపూర్, సంఘం పల్లి గ్రామాలలో ప్యాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సందర్శించినారు. అనంతరం దాన్యం కొనుగోలులో జాప్యంపై రైతులతో మాట్లాడి, సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించగా ఆధార్ కార్డ్ ఫోన్ కి లింక్ ఉండాలని ఫోన్ కి వచ్జిన ఓటిపి ని రైతులు నిర్వాహకులకు తెలపాలని లేని పక్షంలో దాన్యం కొనుగోలు చేయరాదని అన్నారు. ఆధార్ అనుసంధానం లేక రైతులకు ఇబ్బందులు వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే అన్నదాతకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు, తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని, రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ సందీప్ రావు, సర్పంచులు రాజేశ్వర్ రెడ్డి, అంకతి మల్లవ్వ మల్లయ్య, మాజీ జడ్పీటీసీ ఎల్లారెడ్డి, నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.