అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక

Published: Friday October 08, 2021
మధిర, అక్టోబర్ 07, ప్రజాపాలన ప్రతినిధి : మధిర రైల్వే స్టేషన్ ఆవరణంలోని రామాలయంలో గురువారం ఉదయం అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం నిర్వహించడం జరిగిందని ఏజెంట్ అసోసియేషన్ అధ్యక్షులు యర్రమల నర్సిరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమం డి.వి.ఎం సోమేశ్వర రావు అధ్యక్షతన నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి మద్దినేని రామారావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోగుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మన తెలంగాణలో అగ్రిగోల్డ్ ఆస్తులు సుమారు 1000 కోట్ల పైనే ఉన్నాయని అగ్రిగోల్డ్ బాధితులకు ఇవ్వాల్సిన 500 కోట్లు మాత్రమేనని, ఆంధ్ర రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించి అగ్రిగోల్డ్ బాధితుల ఆదుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. అగ్రిగోల్డ్ అసోసియేషన్స్ కమిటీ ఎన్నిక ఈ సందర్భంగా జరిగిందన్నారు. అధ్యక్షులుగా ఎర్రమల నర్సిరెడ్డి, ఉపాధ్యక్షులుగా కొత్తపల్లి రాణి, ప్రధాన కార్యదర్శిగా మునగనూరు మురళీధర్, కోశాధికారిగా కొండపర్తి నరసింహారావును ఎన్నికైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగయ్య, అచ్చయ్య, రాములు, నాగేశ్వరరావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.