మంత్రి హరీష్ రావుని కలిసిన లింగాల కమల్ రాజు

Published: Friday October 07, 2022

మధిర  అక్టోబర్ 6 ప్రజా పాలన ప్రతినిధి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ బిఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇంచార్జి లింగాల కమల్ రాజు గురువారం హైదరాబాద్లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నిరు హరీష్ రావుని కలిసి వినతిపత్రం అందజేశారు ముఖ్యంగా మధిర పట్టణంలో ఆయుర్వేదిక్ హాస్పిటల్ అద్దె భవనంలోనడుస్తుంది దానికి శాశ్వత భవనాన్ని నిర్మించాలని, వంద పడకల హాస్పిటల్ పూర్తి కాగానే, పాత హాస్పిటల్ భవనంలో మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ నడిపేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. మదిర నియోజకవర్గంలోని పలు మేజర్ గ్రామపంచాయతీలలో సబ్ సెంటర్లను మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఆయన మంత్రి హరీష్ రావుని కోరారు.