దారికి అడ్డుగా ఉన్న బారికేడ్లు

Published: Monday July 19, 2021
హైదరాబాద్ 18 జులై ప్రజాపాలన : కరోనాను అరికట్టే దిశగా రాష్ట్రంలో లాక్ డౌన్ చేశారు. దీనితో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. పలు ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్ లు చెక్ పోస్టులు పెట్టి ప్రజలను నియంత్రించడం జరిగింది. ప్రస్తుతం లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత అన్ని ఆఫీసులు దుకాణ సముదాయాలు పరిశ్రమలు పనిచేయడంతో రోడ్లపై వాహనాల రద్దీ పెరిగింది. కొన్ని చోట్ల బారికేడ్లను తొలగించక పోవడం వలన రద్ధీ సమయాల్లో వాహన దారులకు ఇబ్బందికరంగా ఉన్నది పలువురు వాహనదారులు అనుకుంటున్నారు. 65 జాతీయ రహదారిపై పటాన్ చెరువు వద్ద బారికేడ్లు పాక్షికంగా మూసివేసిన దృష్యం. నేషనల్ హైవే అయిన పటాన్ చెరువు పాత టోల్ గేట్ ప్రాంతంలో 5 లేన్ లకు గాను రెండులేన్ లు  మూసివేయడంతో రద్ధీ వేల ఇక్కడ జామ్ అవుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల రద్దీ పెరిగి ఆలస్యం అవుతుంది. అవసరం లేని చోట దారికి అడ్డంగా పెట్టిన బారికేడ్లను తొలగించాలని సంబంధిత అధికారులను వాహనదారులు కోరుతున్నారు.