కరోనా రక్షణ చర్యలు తీసుకోవాలి: మున్సిపల్ వైస్ చైర్మన్ విద్యా లత

Published: Monday May 17, 2021
మధిర, మే 15, ప్రజాపాలన ప్రతినిధి : మధిర, మున్సిపాలిటీ వైస్ ఛైర్మెన్ శీలం విద్యా లత గారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. శనివారం మున్సిపాలిటీలోని 5వ వార్డులో హైపో క్లోరైడ్ ద్రావకాన్ని పిచికారీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మధిరలో కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా సెకండ్ వేవ్  అధికంగా ఉండటం వలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా ప్రబలుతున్న తరుణంలో మధిర మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గారి  హైపోక్లోరైడ్ ద్రావకాన్ని పిచికారి చేస్తున్నట్లు  విద్యా లత గారు తెలిపారు. ప్రజలంతా మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలని విద్యా లత గారు కోరారు. భౌతిక దూరం పాటిస్తూ, నిరంతరం చేతులను శాని టైజర్లుతో శుభ్రం చేసుకోవాలని, కరోనాకి మనోధైర్యంమే మందు ఆని మధిర  శీలం విద్యా లత గారు తెలిపారు.