హనుమాన్ దేవాలయ నూతన దుకాణాల సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ రాయికల్, నవ

Published: Wednesday November 23, 2022

రాయికల్ పట్టణ శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆంజనేయ స్వామి నీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, 59 లక్షల రూ.ల, టి.యు.ఎఫ్.ఐ. డి.సి.  నిధులతో నిర్మించిన ఆలయ షాపింగ్ కాంప్లెక్స్ మరియు ధ్యాన మందిరం ను ప్రారంభించిన ఎమ్మేల్యే డా :సంజయ్ కుమార్ అనంతరం రాయికల్ పట్టణానికి చెందిన 16మంది లబ్ధిదారులకు  సి.ఎం. సహాయ నిధి ద్వారా మంజూరైన 5లక్షల27 వేల రూ.ల చెక్కులను లబ్దిదారులకు అందజేసిన తరువాత ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జగిత్యాలను జిల్లా గా  చేసి రాయికల్ ను మున్సిపల్ గా మార్చి రాయికల్ అభివృద్ధికి  25 కోట్లు రూ.లు మంజూరు చేశామని, నేడు రాయికల్ అభివృద్ధి కళ్ళకు కనిపిస్తుంది. సీ.ఎం సహాయ నిధి నిరుపేదలకు వరం అని,అనారోగ్యం తో శస్త్ర చికిత్సలు చేసుకొని ఆర్థికంగా నష్టపోయిన ప్రజలకు అండగా ముఖ్యమంత్రి  సహాయ నిధి  చెక్కులు అందజేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మోర హనుమండ్లు,వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి,ఆలయ ఛైర్మెన్ ఎనగందుల సత్యనారాయణ, పాక్స్ ఛైర్మెన్ ఏనుగు మల్లారెడ్డి,
పట్టణ,మండల పార్టీ అధ్యక్షులు ఇంతియాజ్,కొల శ్రీనివాస్,కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు,పట్టణ,మండల పార్టీ నాయకులు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.