టీబీ వ్యాది కి విలువైన ప్రభుత్వమందులు ఉచితం

Published: Friday February 04, 2022

మధిర ఫిబ్రవరి 3 ప్రజాపాలన ప్రతినిధి : మధిర టౌన్ లో ఎస్ సి కాలనీ 11 వార్డు నందు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరుపున  జిల్లా క్షయ నివారణసంస్థ తరపున  పిహెచ్సి దెందుకూరు వైద్య అధికారులు డా వెంకటేష్ డా శశిధర్ సూచనలు మేరకు  మధిర మండల్ టీబీ నోడల్ పర్సన్ లంకా కొండయ్య  బృందం క్షయ వ్యాది పై సంపూర్ణ అవగాహనా కార్యక్రమం చేపట్టారు.  ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిది గా 11వార్డు కౌన్సిల్ శ్రీమతి గద్దల మాధురి హాజరై తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ తరుపున ఆరోగ్య సిబ్బంది చే విలువైన టీబీ వ్యాది మందులు టీబీ నివారణ నిమిత్తం ఇస్తున్నారు కనుక ఎవరికైనా క్షయ వ్యాది లక్షణాలు ఉంటే తేమడ పరీక్షలు చేయుంచు కొని నివారణ మందులు వాడ వలెను అని ఆమె తెలిపినారు. అనంతరం హెచ్ఎస్ లంకా కొండయ్య టీబీ వ్యాది చిత్ర పటాలు ద్వారా ప్రజలను చైతన్య పరిచి ఇంటింటికి తిరుగుతూ  వ్యాదిలక్షణాలు ఉన్న వారిని గుర్తించి స్పుటుం డబ్బాలు పంపిణి చేసినారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎస్ సుబ్బలక్ష్మి ఎఎన్ఎమ్ లు వి విజయ్ కుమారి విజయ్ లక్ష్మి ఆశ లు సమీపా రజిని సుజాత మార్థమ్మ లక్ష్మి పాల్గొన్నారు.