వికారాబాద్ పట్టణాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

Published: Wednesday March 16, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 15 మార్చి ప్రజాపాలన : వికారాబాద్ పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను కోరారు. మంగళవారం బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే వికారాబాద్ పట్టణం జిల్లా కేంద్రంగా మారిందని గుర్తు చేశారు. పట్టణ జనాభా సుమారు లక్ష వరకు ఉంటుందని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి పనుల్లో భాగంగా కొంత వరకు రోడ్డు డివైడర్, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడమైనదని వివరించారు. బిజేఆర్ చౌరస్తా నుండి రాజీవ్ నగర్ కాలనీ వరకు, ఎన్టీఆర్ చౌరస్తా నుండి రాజీవ్ నగర్ కాలనీ వరకు, బిజెఆర్ చౌరస్తా నుండి అనంతగిరిపల్లి వరకు, ఆలంపల్లి నుండి కొత్తగడి వరకు,  ఎన్నేపల్లి నుండి శివారెడ్డి పేట్ వరకు, గోధంగూడ రోడ్డు రైల్వే ట్రాక్ వరకు సెంట్రల్ లైటింగ్ రోడ్ డివైడర్ పనులు చేయాల్సి ఉన్నదని చెప్పారు. శివారెడ్డి పేట్ కు సంబంధించి మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడానికి నిధులు సమకూర్చాలని కోరారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పట్టణ అభివృద్ధికి నిధులు సమకూర్చాలని కోరిన అంశాన్ని నోట్ చేసుకున్నామని పేర్కొన్నారు. గతంలో కూడా పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించామని గుర్తుచేశారు.
పేద విద్యార్థులకు అకామిడేషన్ కల్పించాలి : పేద విద్యార్థులకు అకామిడేషన్ కల్పించాలని బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జీరో అవర్ క్వశ్చన్ లో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కోరారు. సోమవారం జీరో అవర్ క్వశ్చన్ లో భాగంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా సంబంధిత సంక్షేమశాఖ మంత్రులకు పేద విద్యార్థులకు అకామిడేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలు గల విద్యను అందిస్తున్నారని పేర్కొన్నారు. భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో పేద విద్యార్థులు సీట్లు సంపాదిస్తున్నారని గుర్తుచేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో కూడా పేద విద్యార్థులు సీట్లు సంపాదించడం అభినందనీయమని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం అకామిడేషన్ కేటాయించడంతోనే చక్కగా చదువుకుంటున్నారని స్పష్టం చేశారు. కరోనా రావడంతో విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయని చెప్పారు. విద్యార్థులందరూ ఇళ్లలోకి వచ్చారని వివరించారు. కరోనా తగ్గిన నేపథ్యంలో విద్యా సంస్థలను తిరిగి తెరుచుకున్నాయని తెలిపారు. విద్యాసంస్థలు తెరుచుకున్నా విద్యార్థులకు అకామిడేషన్ కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది పేద విద్యార్థులకు అకామిడేషన్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ప్రశ్నను నోట్ చేసుకున్నాను అన్నారు.