ఆలేరు పట్టణంలో జరిగే డివైఎఫ్ఐ జిల్లా స్థాయి రాజ కీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలి ------

Published: Friday December 02, 2022
చౌటుప్పల్ డిసెంబర్ 1 (ప్రజాపాలన ప్రతినిధి)
డిసెంబర్ 5,6 ఆలేరు పట్టణంలో జరిగే డివైఎఫ్ఐ జిల్లా స్థాయి రాజ కీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయగలరని కోరుతూ చౌటుప్పల్ కందాల రంగారెడ్డి స్మారక భవనంలో కరపత్రాల ఆవిష్కరం జరిగింది.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యాసులు పల్లె మధు రాష్ట్ర డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎండి ఖయ్యుం మాట్లాడూత దేశ ప్రధాని మోడీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్ని దేశ యువత ను మోసం చేశారని అన్నారు. ప్రతి ఒక్కరి అకౌంట్లలో 15 లక్షల రూపాయాలు జమ చేస్తానని ప్రజల ను వంచించారు. రూపాయి. మారక విలువ పతానానికి గల కారణాలు అడిగితా మతం అడ్డం పెట్టుకొని. రాజకీయాలు నడుపుతున్నారు అని అన్నారు భారత రాజ్యాంగాన్ని ఈ తూట్లు పొడిచే విధంగా చట్టాలు నిరుగారున్ను ఉన్నారని ఉన్నారు ప్రశ్నించే గొంతులపై దేశ ద్రోహం పేరుతో జైలల్లో పెడుతున్నారని, కేంద్ర ప్రభుత్వనికి సహకరించకపోత ఈడి, ఐటి, పేరుతో ప్రభుత్వాలని కూలగొడుతూన్నారని బిజెపి రాజకీయాలను తొడిగొట్టేందుకు డివైఎఫ్ఐ యువతి యువకులకు రాజకీయలు దేశ, రాష్ట్ర పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులను ఉపయోగించుకోవాలని అన్నారు కరపత్ర ఆవిష్కరణలో డివైఎఫ్ఐ మున్సిపల్ మండల అధ్యక్షుడు దేప రాజు, సామిడి నాగరాజు రెడ్డి, నాయకులు రత్నం శ్రీకాంత్, మెట్టు శ్రావణ్, సాయి, శ్రీకాంత్, ఖసిమ్, పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు,