మొండితోక సుధాకర్ రావు కు పలువురి పరామర్శ

Published: Tuesday June 08, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి ఏడో తేదీ మధిర మున్సిపాలిటీ పరిధివిశ్రాంత ప్రధానోపాధ్యాయులు, స్వాతంత్ర్య సమరయోధులు, TRS నాయకులు మొండితోక సుధాకర్ గారి తండ్రి  గారైనా కీర్తిశేషులు శ్రీ మొండితోక ప్రేమనందం గారు ఇటీవలే స్వర్గస్తులైన విషయం విదితమే ఈ సందర్భంగా పలువురు నాయకులు, జర్నలిస్ట్ సోదరులు ఆయన చిత్ర పటానికి నివాళులర్పించారు అలాగే మొండితోక సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించారు. వీరిలో సీనియర్ జర్నలిస్టు లు సూర్య GV, టీవీ5 నాగరాజు, వార్త మధు, ప్రజాపాలన పసుపులేటి నాగేంద్రశ్రీను, శ్రీధర్, మువ్వ రామకృష్ణ, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాటిబండ్ల సత్యం బాబు, దమ్మపేట మండల అధ్యక్షులు దొడ్డ రాజేశ్వరరావు, మాజీ రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ యన్నం కోటేశ్వరరావు, మర్లపాడు సొసైటీ అధ్యకులు కటికల సీతారామిరెడ్డి, cpi టౌన్ బెజవాడ రవి, ఊట్ల కొండ, లక్ష్మణ్, aisf జిల్లా అధ్యక్షులు అప్పారావు, శివాలయం మాజీ చైర్మన్ కోమటిడి శ్రీనివాసరావు పలువురు పరామర్శించారు.