స్థానిక సంస్థలకు ఉపాధ్యాయులను అప్పగించాలనే ఆలోచనతో కేసీఆర్, తుగ్లక్ ను మరిపిస్తున్నారు: బత

Published: Wednesday February 17, 2021
ఖమ్మం, ఫిబ్రవరి16, ప్రజాపాలన: రాష్ట్రంలో పరిపాలన కెసిఆర్ నేతృత్వంలో పరిహాసంగా మారిందని తెలంగాణ ఇంటి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బత్తుల సోమయ్య విమర్శించారు.,మంగళవారం ఆయన వైరాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ గారి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. తెలంగాణవస్తే ఉద్యోగాలు, ఉపాధిఅవకాశాలు పెరుగుతాయని భావిస్తే, అందుకు విరుద్ధంగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వీఆర్వో వ్యవస్థ రద్దుచేసి, కార్యదర్శిలను తొలగించి, స్థానిక సంస్థలకు ఉపాధ్యాయులను అప్పగించే అనవసర పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ సిద్ధించిన తరువాత ఈ ఆరు ఏళ్లలో 850కి పైగా స్కూళ్లను రద్దుచేశారు. ఉపాధ్యాయ నియామకాలు పూర్తిగా నిలిపివేశారు. రిటైరయిన స్థానాలు నింపడంలేదు. సర్వీసులో ఉన్నవారికి ప్రమోషన్లు లేవు. ఉద్యోగులకు పిఆర్సి ఇస్తామంటూ మూడేళ్లుగా మురిపించడమేకానీ, పిఆర్సి లేదు కనీసం ఐర్ కూడా ఇచ్చిందిలేదు. ఇప్పుడు ఉద్యోగులువేరు, ఉపాధ్యాయులువేరు అంటూ విభజించాలని, విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రైవేటు కార్పొరేట్ శక్తుల పరం చేయాలని కెసిఆర్ కుట్రలు చేస్తున్నాడు. క్రమక్రమంగా ప్రభుత్వాధీనంలో ఉన్న అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో ఎక్కడా బాగుపడలేదు. అలాగే గురువులను అవమానించిన పాలకులు కాలగర్భంలో కలిసిపోయారనే చారిత్రక సత్యాన్ని తెలుసుకొని మసలుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు డాక్టర్ చెరుకు సుధాకర్ విజయం అనంతరం, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేస్తారని అన్నారు. అదేవిధంగా,  ప్రభుత్వరంగ సంస్థల అమ్మకానికి కూడా సుధాకర్ విజయం అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో గూగులోత్ తావుర్యా, దాసరి ప్రసాద్, వడ్డెబోయిన వెంకటేశ్వర్లు, చాపల ఉపేందర్, భూక్యా రమేష్, దుగ్గినేని నరేష్, పూలా ఆంజనేయులు, బానోతు శ్రీను, గాదె లక్ష్మణరావు, మాలోత్ నరేష్, అజ్మీరా వినోద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.