వితంతు, వికలాంగులుకు భద్రం చేయూత

Published: Friday May 28, 2021
మధుర ప్రజా ప్రతినిధి 27వ తేదీ మధిర మున్సిపాలిటీప్రార్థించే పెదవుల కన్న సహాయం చేసే చేతులు మిన్న అన్న మదర్ థెరిసా స్ఫూర్తితో ఎదుటి వారికి కొంత ఐనా సహాయం చేయాలని ఉద్దేశ్యంతో సెకండ్ వేవు లాక్ డౌన్ లో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న వితంతు మహిళ లకు వికలాoగురాలు ఐన మహిళా కుటుంబాలకు ప్రముఖ సామాజిక సేవకులు, ఆరోగ్య పరివేక్షకులు లంకా కొండయ్య సూచిoచిన నిరుపేద అబాగ్యులకు గురువారం ఉదయం 8 గంటలకు కొండయ్య నివాస ప్రాంగణంలో ప్రముఖ కన్యకా పరమేశ్వరి జ్యుయాలరీ అధినేత శ్రీ మైలవరపు వీరభద్రరావు ఆర్ధిక వితరణతో ఒకొక్క కుటుంబంనకు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు సంజీవని స్వచ్చంద సంస్థ డైరెక్టర్ శ్రీ కోనా జగదీష్, వీరభద్రం, కొండయ్య చేతుల మీదుగా అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మనం భూమి మీద పుట్టినప్పుడు ఏమి తీసుకు రాలేదు, అలానే మనo వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకుపోము. కనుక భూమి మీద బ్రతికినంతకాలం దేవుడు మనకు ఇచ్చిన దానిలో కొంతయినా కడుపేదలకు సహాయం చెస్తే బాగుంటుంది అని వారు తెలియ పరిచినారు. మేము సైతం అభాగ్యులకోసం అని ముందుకు వచ్చిన భద్రం కుటుంబంనకు కొండయ్య మిత్ర బృందం హృదయ పూర్వక అభినందనలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు అదిమూలం వెంకటేష్, లంకా శ్యామ్ కుమార్, లంకా సాయి, గోపి, అంజి పాల్గొన్నారు.