గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి

Published: Thursday September 09, 2021
మధిర ప్రజా పాలన ప్రతినిధి ఎనిమిదో తేదీ.గణేష్ మంటపాల నిర్వహణ కమిటీదారులు తప్పనిసరిగా పోలీసు శాఖ నుండి అనుమతి తీసుకోవాలని మధిర సీఐ మురళి తెలిపారు. బుధవారం స్థానిక రిక్రియేషన్ క్లబ్ కల్యాణ మండపంలో గణేష్ ఉత్సవ నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు సందర్బంగా గణేష్ మండపాల ఏర్పాటుకు, విగ్రహాల ఏర్పాటుకు ఉత్సవ కమిటీలు మంటపాల అనుమతి కోసం అన్ని వివరాలతో పోలీసు వెబ్ సైట్ నందు ఆన్లైన్ ద్వారా దరకాస్తూ చేసుకోవాలన్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను తాను పరిశీలించి అనుమతి నిమిత్తం  వైరా ఏసీపీ వద్దకు పంపడం జరుగుతుందని ఆయన అన్నారు. ఏసీపీ పరిశీలన అనంతరం అనుమతి ఇవ్వటం జరుగుతుందని ఆయన అన్నారు. సక్రమంగా లేని దరఖాస్తులను తిరస్కరించబడతాయని ఆయన తెలిపారు. గణేష్ మంటపాల నిర్వహణ కమిటీదారులు విదిగా మంటపాల్లో విగ్రహం దగ్గర విగ్రహ నిమజ్జనం అయ్యేంతవరకు అనుమతి పత్రాన్ని అతికించాలని ఆయన సూచించారు. గణేష్ మంటపాల నిర్వహణ కమిటీదారులు ఆన్లైన్ దరఖాస్తు ఫారంతో పాటు విద్యుత్ శాఖ అనుమతి హౌస్ ఓనర్ లేదా రెసిడెంట్ అసోసియేషన్ లేదా మున్సిపాలిటీ నుండి అనుమతి తీసుకొన్న పత్రాన్ని స్పీకర్స్ కోసం ప్రత్యేకంగా అనుమతి పత్రాన్ని కూడా విధిగా జత చేయాలన్నారు. గణేష్ మండపాల వద్ద డిజేకి  అనుమతి లేదన్నారు. రహదారులపై విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు భక్తులందరూ సహకరించవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సైదులు ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి పట్టణ ఎస్ఐ సతీష్ కుమార్ కమిషనర్ అంబటి రమాదేవి విద్యుత్ శాఖ ఏఈ శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.