మన్నెగూడ చౌరస్తా లో ఘనంగా దొడ్డి కొమురయ్య 76 వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు

Published: Tuesday July 05, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 4 ప్రజాపాలన ప్రతినిధి

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు, తుపాకీ గుండు కు గుండెని అడ్డం పెట్టి సాయుధ పోరాటానికి ఊపిరిలు ఊదిన తెలంగాణ భగత్ సింగ్ గారి 76 వ వర్ధంతి పట్నం రమేష్ కురుమ అధ్యక్షతన  మన్నెగూడ కురుమ సంక్షేమ సంఘం  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది *

వక్తలు మాట్లాడుతూ తెలంగాణ షాన్ అయినటువంటి దొడ్డి కొమురయ్య గారి విగ్రహం ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలని
అలాగే   ఎన్నో ఏండ్లుగా దేశానికి మాంసాన్ని పాలను అందిస్తు శ్రమ దోపిడీకి గురవుతున్న , తెలంగాణ జనాభాలో 15% ఉన్న కురుమల కు 15000 కోట్లతో కురుమ కొర్పొరేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు 
అనంతరం తెలంగాణ వంటకం అయిన అంబలిని బాటసారులకు అందించడం జరిగింది
ఈ కార్యక్రమంలో మన్నెగూడ  కురుమ సంక్షేమ సంఘం అధ్యక్షులు వస్పరి మల్లేష్ కురుమ,
మాజీ వార్డు మెంబర్లు ఓర్సు అనిత శ్రీనివాస్, కామిశెట్టి యాదగిరి ప్రజాపతి,
ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బద్రయ్య ముదిరాజ్ , అంబేద్కర్ సంఘం నాయకులు కొమ్మని పెంటయ్య ,  వంశరాజ్ సంఘం నాయకులు శ్యామల సురేష్ , గోరిగే నర్సింహ, కొశిక నర్సింహ, గోరిగే బాబు, కొంగళ్ల శివ, ఎగ్గిడి నర్సింహ , మొర్రి నాగరాజు, గోరిగే రమేష్,  ఢిల్లీ నర్సింహ, గోరిగే శేఖర్ , సుభాష్ రెడ్డి,  కేంచ శ్రీకాంత్, సురేష్ కురుమ,  కిరణ్, అశోక్ కుమార్,  కొంగళ్ల చింటు, ఇప్ప సాయి కుమార్   లు పాల్గొన్నారు..