భారీ వర్షానికి ఈదులవాడ లో కూలిన ఇల్లు ** బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం ** ఎంపీపీ అరిగెల మల్లికార

Published: Monday August 08, 2022

ఆసిఫాబాద్ జిల్లా జూలై 07 (ప్రజాపాలన ప్రతినిధి)  : ఆసిఫాబాద్ మండలంలోని ఈదులవాడ గ్రామపంచాయతీ పరిధిలో గల గొల్లగుడా గ్రామానికి చెందిన తూమోజు ప్రసాద్ ఇల్లు ఆదివారం కురిసిన భారీ వర్షానికి కూలిపోవడంతో ఆ గ్రామ సర్పంచ్ బూసి భీమేష్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ యాదవ్ రెవిన్యూ శాఖ అధికారులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. వీరి వెంట గ్రామస్తులు దాసరి మల్లేష్, రాజయ్య,తదితరులు ఉన్నారు.