యేసుక్రీస్తు బోధనలు అనుసరణీయం : డా.రామనాధ

Published: Monday December 20, 2021
మధిర డిసెంబర్ 20 ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణంలో స్థానిక ఆజాద్ రోడ్డులో ప్రముఖ సామాజిక సేవకుడు లంకా కొండయ్య గృహ సముదాయం నందు శనివారం రాత్రి నూతన యెరూషలేము ప్రార్ధన మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్ట్ మస్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిధి గా రాష్ట్ర టీడీపీ నాయకులు ప్రజవైద్యులు ఉత్తమ రాజకీయ వేత్త శ్రీ వాసిరెడ్డి రామనాదo మరియు విశిష్ట అతిధులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీమతి  శీలం విద్యాలత వెంకటరెడ్డి మరియు మధిర మండల ఎంపీపీ శ్రీమతి మొండెం లలిత వెంకయ్య హాజరు అయినారు. ఈ సందర్బంగా డాక్టర్ రామ నాదo మాట్లాడుతూ మానవుడు హింసను విడనా డి శాంతి  ప్రేమ దయ కరుణ కల్గి ఉండాలి అని, సర్వ మాన వాళికి యేసు క్రీస్తు బోధనలు అనుసరణియం అని ఆయన అన్నారు. అదేవిదంగా విద్య లత వెంకటరెడ్డి, ఎంపీపీ లలిత వెంకయ్య మాట్లాడుతూ ప్రతి మనిషి పాపాలకు దూరంగా ఉండాలి అని, చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి పనులు చేయడానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం పెద్దల చేతుల మీదుగా క్రిస్టమస్ కేకు కట్ చేశారు. మధిర మండల పాస్టర్ ఫెలో షిప్ మధిర మండల అధ్యక్షులు పాస్టర్ గొల్ల మంద ల దయాకర్ తెలంగాణ ట్రైబల్ క్రిస్టియన్ మినిస్ట్రీస్ డైరెక్టర్ పాస్టర్ యన్ బాబురావు పాస్టర్ జీవరత్నం కేరళ బీలీవ ర్స్ చర్చ్ విభాగపు బిషప్ బ్రదర్ తాళ్ళూరి బాలరాజు పాల్గొని బైబిల్ లోని మానవీయ విలువలు పెంచి మంచి మార్గంలో నడిపించే బోధనలు భక్తులకు వివరించారు. వచ్చిన పెద్ద లుకు మర్యద పూర్వక ముగా దుస్సాలువాతో పుష్ప గుచ్చాలతో ఘనంగా సత్కరించారు. హాజరైనా ప్రతి ఒక్కరికి ప్రేమ విందు ఏర్పాటు చేసినారు కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండీ వచ్చిన  సేవకులు  క్రిస్టియన్ విశ్వసులు నూతన యెరూసలేము ప్రార్ధన మినిస్ట్రీస్ వాలంటీర్ లు కిరణ్ వెంకీ శ్యామ్ అంజి గోపి సాయి కరుణ యెహాను తదితరులు పాల్గొన్నారు.