విస్తరణ కార్యకలాపాల వేగం పెంచిన మలబార్ గోల్డ్

Published: Monday March 29, 2021
అమీర్ పేట్, మార్చి 28, ప్రజాపాలన ప్రతినిధి: ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రపంచ వ్యాప్తంగా తమ కార్యకలాపాల విస్తరణ వేగాన్ని పెంచిందని సంస్థ చైర్మన్ ఎంపీ అహ్మద్ విడుదల చేసిన విలేకరుల ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సోమాజిగూడలోని మలబార్ స్టోర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్టోర్ హెడ్ షరీజ్ మాట్లాడుతూ.. గత 25 సంవత్సరాలుగా వినియోగదారులకు విశిష్ట సేవలను అందిస్తూ బలమైన వ్యాపార సామ్రాజ్యంగా మలబార్ గోల్డ్ ఎదిగింది అని అన్నారు. చిన్న ఆభరణాల రిటైల్ సంస్థ గా మొదలుపెట్టి బంగారం వజ్రాల రిటైల్ వ్యాపారం ఆభరణాల తయారీ బహుళ రిటైల్ కాన్సెప్ట్ లతో అంతర్జాతీయ వ్యాపార సంస్థ గా రూపాంతరం చెందిందని అన్నారు. పారదర్శకత కస్టమర్ల నమ్మకం అని అన్నారు. నాణ్యమైన డిజైన్లు, సేవా నైపుణ్యాలతో, అసమానమైన ఆభరణాలు కొనుగోలు తో ప్రత్యేక అనుభవాన్ని అందిస్తుందని అన్నారు. ప్రస్తుతం భారత దేశంలో 40 షో రూమ్ లను అంతర్జాతీయంగా 16 షో రూమ్ లను ఈ సంవత్సరం ప్రారంభించడానికి సన్నాహాలు సిద్ధం చేసిందని తెలిపారు.