ప్రాధామిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆశా వర్కర్ల నిరసన

Published: Tuesday December 06, 2022

శంకరపట్నం డిసెంబర్ 05 ప్రజాపాలన రిపోర్టర్:


మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు మండలంలోని అన్ని గ్రామాల ఆశ వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్, రాజమణి మాట్లాడుతూ.. ఆశ వర్కర్లతో స్కూటమి డబ్బాలు మోపించే విధానాన్ని రద్దు చేయాలని ప్రత్యేక కార్యక్రమాలకు సందర్భంగా నిర్వహిస్తున్న సర్వేలకు ఇతర కార్యక్రమాలకు అదనంగా పారితోషకాలు చెల్లించాలని పెండింగ్లో ఉన్న బిల్లును వెంటనే చెల్లించి ఫిక్స్డ్ వేతనం గా పదివేల రూపాయలను నిర్ణయించే విధంగా ప్రకటన చేయాలని ఆమె కోరారు అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెమోరాండం సమర్పించారు ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల ఆశా వర్కర్లు పాల్గొన్నారు.