రెండవ కోవిడ్ వాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ జాన్సామ్సన్ మేయర్ జక్క

Published: Thursday May 13, 2021
మేడిపల్లి, మే12 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని మేడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనంగా రెండవ కోవిడ్ వాక్సిన్ కేంద్రాన్ని మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ డి.జాన్ సామ్ సన్ ప్రారంభించారు. పీర్జాదిగూడ నగర పాలక సంస్థలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ సెంటర్ లో ఎక్కువ మందికి టీకా వేసే సదుపాయం లేనందున విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని అదనంగా రెండవ వ్యాక్సినేషన్ సెంటర్ మంజూరు చేయాలని కోరగా స్పందించి వాక్సినేషన్ సెంటర్ ఏర్పాటుకు తమ వంతు సహకారం అందించిన మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ జిల్లా వైద్యాధికారికి మేయర్ జక్క వెంకట్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మేయర్ జక్క వెంకట్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ డి.జాన్ సామ్ సన్, డిఎంహెచ్ఓ డా.మల్లికార్జున్ రావులు కోవిడ్ కేర్ సెంటర్ ను సందర్శించి వారికి కల్పిస్తున్న వసతులు, అందిస్తున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్, డాక్టర్ అనిల్, కార్పొరేటర్లు కే.సుభాష్ నాయక్, బొడిగే స్వాతి, బచ్చ రాజు, వీరమల్ల సుమలత, మద్ది యుగేందర్ రెడ్డి, అలువాల సరిత, పిట్టల మల్లేష్, ఎన్.మధుసూదన్ రెడ్డి, ఎంపల్ల అనంత్ రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు చిలుముల జగదీశ్వర్ రెడ్డి, చెరుకు వరలక్ష్మి, నాయకులు బొడిగే కృష్ణా గౌడ్, వీరమల్ల సత్యనారాయణ, బండారు రవీందర్, అలువాల దేవేందర్ గౌడ్, చెరుకు పెంటయ్య గౌడ్, జావిద్ ఖాన్,  తదితరులు పాల్గొన్నారు.