విజయానికి ప్రతీక విజయదశమి.. న్యాయవాది గుర్రాల బ్రహ్మారెడ్డి..

Published: Tuesday October 04, 2022

తల్లాడ, అక్టోబర్ 3 (ప్రజాపాలన న్యూస్): విజయానికి ప్రతీకగా విజయదశమి (దసరా) పండుగను జరుపుకుంటారని తల్లాడ ప్రముఖ న్యాయవాది (లాయర్) గుర్రాల బ్రహ్మారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ గత ఎనిమిది రోజులు పాటు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించి వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. విగ్నేశ్వరుడు కరుణతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు.