కరెంట్ షాక్ తో మృతి చెందిన కారోబార్ కుటుంబాన్ని ఆదుకుంటాం : సర్పంచ్ పి.చంద్రశేఖర్ రెడ్డి

Published: Monday May 17, 2021
పరిగి, 16 మే ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా, దోమ మండల పరిధిలోని గూడూరు గ్రామంలో శుక్రవారం జరిగిన విద్యుత్ షాక్ తో మృతి చెందిన గూడూరు గ్రామ పంచాయతీ కారోబార్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆడుకుంటామని గూడూరు గ్రామ సర్పంచ్ పి.చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కారోబార్ గా విధులు నిర్వహిస్తున్న వడ్డే నర్సింలు రైతు పొలంలో బోర్ మోటార్కు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆ రైతు అప్పుడప్పుడు విద్యుత్ పనులు చేసే అలవాటుగా ఉండడంతో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందడం జరిగింది. స్థానికంగా కుటుంబానికి 50 వేల రూపాయలు గ్రామస్తులతో కలిసి కొందరు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావడంతో మృతుని పిల్లల చదువుకు ఇవ్వనున్నట్లు తెలిపారు.. ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వ ఆర్థిక సహాయం.. మృతుని కుటుంబాన్ని ఆదుకునే విషయంలో మండల సర్పంచ్ల సంఘం ద్వారా ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లగా విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు రిపోర్ట్ పంపిస్తే మృతుని కుటుంబానికి 6.లక్షల రూపాయలు సహాయం అందె విదంగా ఎమ్మెల్యే కృషి చేయనున్నట్లు సర్పంచుల సంఘం నాయకులకు ఎమ్మెల్యే తెలిపారు అని సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అలాగే పార్టీ సభ్యత్వం. పంచాయతీ కార్మికుల్లో ఇన్సూరెన్స్ ఉంటే అట్టి డబ్బులు కూడా అందజేయడంతో పాటు స్థానికంగా కొందరు ఆర్థిక సహాయం చేయడానికి ఒప్పుకున్నారని సర్పంచ్ తెలిపారు.