గ్రామ దేవత శివ ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

Published: Monday March 28, 2022
భద్రాద్రి కొత్త గూడెం (ప్రజాపాలన ప్రతినిధి) : భద్రాచలంలోని పాత ఎల్ఐసి ఆఫీస్ రోడ్డు లో వేంచేసి ఉన్న గ్రామ దేవత శివ ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏప్రిల్ 2న జరగనున్న జాతర మహోత్సవం వేడుకల్లో భాగంగా ఆదివారం అంకురార్పణ నిర్వహించారు. గోదావరి నది వద్ద నుంచి తీర్థ జలాన్ని తీసుకువచ్చి మూల మూర్తులకు, ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం నుంచి ఏప్రిల్ 2 వరకు ప్రత్యేక పూజలు అలంకారాలు ఉంటాయని ఆలయ అధ్యక్షులు హరి చంద్ర నాయక్, ఆలయ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం జరిగిన వేడుకల్లో భద్రాద్రి ఆలయ వేదపండితులు హనుమత్ శాస్త్రి, పట్టణ ప్రముఖులు  దనేణేశ్వరరావు, ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.