వీఆర్ఏలను పట్టించుకోని ఈ ప్రభుత్వం మనకొద్దు: మండల వైయస్సార్ తెలంగాణ పార్టీ

Published: Friday September 09, 2022

బోనకల్, సెప్టెంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని వీఆర్ఏలు గత 44 రోజుల నుండి దీక్షలు చేస్తూ ఉంటే ఇంతవరకు ప్రభుత్వం నుండి వారికి ఎటువంటి సమాచారం రాలేదనీ అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గూడూర్ రమణారెడ్డి, మధిర నియోజకవర్గ అధికార ప్రతినిధి వర్రీ మరియదాసు, వైయస్ఆర్ తెలంగాణ పార్టీ బోనకల్ మండల అధ్యక్షుడు ఇరుగు జానేషు వీఆర్ఏలను పట్టించుకోని ఈ ప్రభుత్వం మనకొద్దు అంటూ వారు విరుచుకుపడ్డారు. విఆర్ఓ గురించి సీఎం కేసీఆర్ 24 ఫిబ్రవరి 2017న శాసనసభలో వారి హామీలు రెండుసార్లు ప్రకటించి మరల ప్రగతి భవనంలో రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు వాటిని గురించి ఏమి పట్టించుకో నీ ముఖ్యమంత్రి చిన్నచిన్న ఉద్యోగులను విఆర్ఏలను అంగన్వాడీలను, మినీ అంగన్వాడీ, ఆశా వర్కర్లను, గ్రామ దీపికలను గ్రామ పరిశుద్ధ కార్మికులను వారిని గురించి పట్టించుకున్న పాపాన లేదనీ, బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని వారు డిమాండ్ చేశారు. ఒకపక్క నిరుద్యోగులు మరోపక్క రైతులు వారి బాధలు చూడలేక వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలమ్మ ఈ తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి పేద ప్రజల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గురించి మహా ప్రజాప్రస్థానం పాదయాత్ర మొదలుపెట్టి ప్రతి పేదవాడిని వారి సమస్యలను అడిగి తెలుసుకుని నేనున్నాను అంటూ భరోసా కల్పించిన మహా నాయకురాలు వైయస్ షర్మిలమ్మ అని అన్నారు. అందుకే రాజశేఖర్ రెడ్డి ఏ పని అయితే తలపెట్టాడు ఆ పనులు నేను చేసి చూపిస్తానంటూ ప్రజలకు భరోసా కల్పిస్తున్న అని ధైర్యం ఇచ్చారు. అసలు చిన్న ఉద్యోగులు వారు చేసే పనిలో ఎంత కష్టం ఉందో దీన్ని గుర్తించి వారికి న్యాయం చేయాలని, అలా కాకుండా శాసనసభ్యులకు ఒక్కొక్కరికి లక్షల లక్షల జీతాలు పెంచుతూ అల్విన్స్ కాకుండానే వారికి అంత జీతాలు ఎందుకు అని పనిచేసేవాడిని పట్టి జీతాలు ఇవ్వాలి కానీ, ఏసీ రూములలో కూర్చునే వారికి జీతాలు పెంచడం సరికాదని అన్నారు.అందుకే ప్రతి పేదవాడికి ప్రతి నిరుద్యోగి ప్రతి రైతుకు కౌలు రైతులను రైతులుగా గుర్తించి వారికి కూడా న్యాయం చేయాలని మా పార్టీ అధినేత్రి వైయస్ షర్మిలమ్మ ఆవేదన చెందారు. ప్రతి దళిత కుటుంబంలో, రైతు కుటుంబంలో వారి గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన మహా నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అలాంటి మహానీయుడును తలుచుకుంటూ ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి వైఎస్ షర్మిలమ్మ పేదలకు రైతులకు నిరుద్యోగులకు కార్మికులకు కర్షకులకు ప్రతి ఒక్కరు కు నేను అండగా ఉంటానని ప్రజాప్రస్థానం పాదయాత్రలో తిరగని ఊరు, తెలియని గల్లి ప్రతి చోట ఆమె అడుగులో అడుగు వేయుటకు జనం తండోపతుండాలుగా వస్తుంటే అది చూస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు ఉన్నాయని వారు అన్నారు. ఏమి పట్టించుకోవడంలేదని ప్రతి ఒక్కరు చెబుతుంటే నేనున్నాను అనే భరోసా ఇచ్చిన మహా నాయకురాలు వైయస్ షర్మిలమ్మ అని అందుకే మరొకసారి గుర్తుచేస్తూ రాజన్న ని గుర్తుకు తెచ్చుకుంటూ తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపించాలని ఆమె ప్రజలను కోరారు. అదేవిధంగా మండలంలోని చొప్పకట్లపాలెం, చిరునోమల రోడ్డు ఎంత దారుణంగా ఉందో ఇదేనా బంగారు తెలంగాణ అని మండిపడ్డారు. బోనకల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పై ఎన్ని గుంటలు పడ్డాయో ప్రభుత్వం గుర్తించాలని, ఎవరికి బంగారు తెలంగాణ కెసిఆర్ కుటుంబానికి మాత్రమే బంగారు తెలంగాణ అని, ఇలాంటి సమస్యలు పెట్టుకొని ప్రతి ఒక ఉద్యోగిని వారి జీతాలను పెంచాలని వారి కోరికలను వారి సమస్యలను పరిష్కరించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బోనకల్ మండల అధికార ప్రతినిధి మర్రి ప్రేమ్ కుమార్, మండల ఉపాధ్యక్షుడు ఎస్ డి సైదా బాబు, మండల యూత్ అధ్యక్షుడు మందా నాగరాజు, ముష్టికుంట గ్రామ అధ్యక్షుడు ఎస్కేస్ మౌలాలి, ఆళ్ళ పాడు గ్రామ అధ్యక్షుడు కందుల వెంకయ్య, రాయల్ పేట గ్రామ అధ్యక్షుడు పేదల గోపి, రామాపురం గ్రామ అధ్యక్షుడు దొంత గోపి, గార్లపాడు గ్రామ అధ్యక్షుడు కట్ల రాజయ్యలు పాల్గొన్నారు.