ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 23 ప్రజాపాలన ప్రతినిధి *వేలం పాటలో 2 లక్షలకు షాప్ ను దక్కించుకున్న తె

Published: Thursday November 24, 2022

ఇబ్రహీంపట్నం: నియోజవర్గ కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సింహగిరి నందు  బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ గ్రేడ్ 2 అధికారి శ్రీనివాస్ రెడ్డి  పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వాహణాధికారి  దేవరశెట్టి ప్రవీణ్ కుమార్,క్లర్కు మీగడ శేఖర్,నిత్యం సేవచేయి భక్తులు  ప్రజల సమక్షంలో కొబ్బరికాయలు పూజ సామాగ్రి  షాపు కొరకు బహిరంగ వేలం పాట  జరుపగా  మొత్తం 9 మంది పాల్గొనగా  హెచ్చు పాటాదారుగా తెల్జూరి   బాలకిషన్ నిలిచి షాప్ ను రెండు లక్షలకు చేజిక్కించుకోవడం జరిగింది.  ఈ దేవస్థానం వద్ద మొట్టమొదటిసారి నిర్వహించిన వేలంపాట ఇంత హెచ్చుగా పోవడం,  సంతోషంగా ఉందని భవిష్యత్తులో ఆలయానికి మరింత ఆదాయం వచ్చే మార్గాలు ఏర్పాటు చేసి ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆలయ కార్యనిర్వాహాణదికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. పెండింగ్లో ఉన్న భూముల సర్వే, హద్దురాళ్ల నిర్ధారణ, ఆలయానికి స్వీపర్ ను వాచ్మెన్ ను వెంటనే  అధికారులు  నియమించాలని పలువురు భక్తులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ లక్షణ్,కే భాస్కర్,ఆర్ కృష్ణ,జె రవీందర్,టీ కృష్ణ,ఎస్ బాబు,బి అశోక్ రెడ్డి,బి కృష్ణ,ఎం సంతోష్,వీరచారి,బి మహేష్,సిహెచ్ కుమార్,దీపక్, భాస్కర్ యాదవ్,మధు గౌడ్,నాగరాజు చారి,శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు