ఎమ్మెల్యే సొంత గ్రామంలో పల్లె ప్రకృతి వనం పరిస్థితి ఇది

Published: Friday September 24, 2021
బెల్లంపల్లి, సెప్టెంబర్ 23, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి సొంత గ్రామం నెన్నెల మండలం జెండా వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గుడి పేటలో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనం పరిస్థితి ఇది. అందరి గ్రామాల్లో అందరికీ పల్లె ప్రకృతి వనాలను అందంగా పెంచాలని చెపుతూ తన గ్రామంలోనే పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలను స్థానిక గ్రామ సర్పంచ్ గానీ గ్రామ కార్యదర్శి గాని ఎటువంటి మొక్కలు నాటకుండానే నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని స్థానిక బిజెపి నాయకులు గోగు సురేందర్ ఆరోపించారు. ఈ విషయమై స్థానిక ఎంపిడిఓ, ఎం పీ వో లకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సర్పంచ్ గ్రామ కార్యదర్శి లపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.