మంత్రి హరీష్ రావు జన్మదినం పురస్కరించుకుని ఉచిత సామూహిక కరోనా వ్యాక్సినేషన్

Published: Friday June 04, 2021

తెల్లపూర్, జూన్ 03, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదినం పురస్కరించుకొని తెల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ లలితా సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా పటాన్ చేరు నియోజకవర్గ శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి హాజరై ప్రారంభించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి హరీష్ రావుకు జన్మదినం శుభాకాంక్షలు తెలిపి, ఆయన నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, కలకాలం ప్రజాసేవలోనే ఉండాలని ఆయన అభిలషించారు. అలాగే ఉచిత సామూహిక కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మున్సిపాల్ చైర్ పర్సన్ లలిత సోమిరెడ్డి ని అభినందించారు, ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.