టి ఎస్ ఆర్ టి సి ఆధ్వర్యంలోకార్తీక మాసంపంచారామాల దర్శనం. మధిర అక్టోబర్ 26 ప్రజా పాలన ప్రతినిధి

Published: Thursday October 27, 2022

కార్తీకమాసం సందర్భంగా టిఎస్ఆర్టిసి మధిరడిపో నుండి పంచారామాల దర్శనకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది.పంచారామాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట ల దర్శనం కొరకు ప్రతి ఆదివారం రాత్రి 9గంటలకు మధిర డిపో వద్ద నుండి ప్రత్యేక ఎక్సప్రెస్ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది.మధిర నుండి ఆదివారం రాత్రి 9గంటలకు బయలుదేరి పంచారామాల దర్శనం చేసుకొని తిరిగి మంగళవారం ఉదయం 6గంటలకు మధిర కు చేరుకుంటుంది. ఈ ప్రయాణం కొరకు పెద్దలకు ఒక్కరికి 1200 రూపాయలు, పిల్లలకు ఒక్కరికి 610రూపాయలు ఛార్జి చేయడం జరుగుతుంది. వీటితో పాటు టోల్ గేట్ చార్జీలు అదనంగా ఉంటుంది. అదేవిదంగా కనీసం 40మంది భక్తుల కోరిక మేరకు అన్నవరం, శ్రీశైలం, వేములవాడ, శబరిమల కు కూడా ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయబడును.కావున ప్రయాణికులు, భక్తులు ఈ సదావకాశంను సద్వినియోగం  చేసుకొనగలరని టీఎస్ ఆర్టీసీ మధిర డిపో మేనేజర్ శ్రీ యస్. దేవదానం తెలియజేసారు.వివరాలకు డిపో ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ శ్రీ. డి. హుస్సేన్ -7981951562, డిపో ట్రాఫిక్ ఇంచార్జ్ శ్రీ టిసిఎన్. రెడ్డి  -9949527898  సంప్రదించగలరు