పల్లె ప్రగతి లో శ్రమదానం

Published: Thursday June 16, 2022
పాలేరు జూన్ 15 ప్రజా పాలన ప్రతినిధి
మండలంలోని వివిధ గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రమదానం కార్యక్రమం ను నిర్వహించారు. మండలంలోని కొత్తకొత్తూరు గ్రామంలో సర్పంచ్ వల్లాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మండలంలో మండల పరిధిలోని కోనాయిగూడెం పంచాయతీ లో సర్పంచ్ పెంటమళ్ల పుల్లమ్మ, ఆధ్వర్యంలో శ్రమదానం కార్యక్రమం ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంటమళ్ల పుల్లమ్మ, ఉప సర్పంచ్ వడ్లమూడి నర్సయ్య,  తదితరులు పాల్గొన్నారు