డిజె ఏఫ్ రాష్ట్ర కార్యదర్శిగా తాడెం రాజ్ ప్రకాష్ నియామకం.

Published: Monday December 12, 2022
మంచిర్యాల టౌన్,  డిసెంబర్ 11, ప్రజాపాలన  : 
 
డి జె.ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన సమావేశంలో డి జె ఎఫ్ నిర్మాణంలో భాగంగా మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పట్టణ కేంద్రానికి చెందిన తాడెం రాజ్ ప్రకాష్ ని జాతీయ అధ్యక్షులు మనసాని కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నుకోవడం జరిగింది అని రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి అన్నారు . ఈ మేరకు ఆదివారం ఆయనను జిల్లా కేంద్రంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డి జె ఎఫ్ ని మరింత బలోపేతం చేయలనే ఉద్దేశ్యం తో రాష్ట్ర కార్యదర్శి గా రాజ్ ప్రకాష్ ని జాతీయ అధ్యక్షులు మనసాని కృష్ణ రెడ్డి ఆదేశాల మేరకు నియమించడం జరిగింది అన్నారు. తదనంతరం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన తాడెం రాజ్ ప్రకాష్ మాట్లాడుతూ తన పై నమ్మకంతో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గా నియమించిన జాతీయ అధ్యక్షులు మనసాని కృష్ణారెడ్డి కి రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు . అదేవిధంగా ఈ నియమాకానికి సంబంధించి తనకు సహకరించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు నారామల్ల విజయ్ కుమార్ ,  మంచిర్యాల జిల్లా అధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు లకు ధన్యవాదాలు తెలిపారు.