మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా పద్మశాలీలవన సమారాధన మహోత్సవం

Published: Monday November 14, 2022
మధిర రూరల్ నవంబర్ 13 ప్రజాపాల ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు ఘనంగా పద్మశాలీల వన సమారాధన మహోత్సవంపద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మండల పరిధిలోని అబ్బూరి వారి మామిడి తోటలో  ఘనంగా వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు మండల పట్టణ పరిధిలో.
పద్మశాలీలు భారీ ఎత్తున ఈ వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటపాటలతో ఆనందంగా గడిపారు. పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. చిన్నారులు వేసిన నృత్యాలు అందరినీ ఆనందపరిచాయి. తొలుత పద్మశాలీయుల కుల బంధువులు  శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత నిర్వహించుకున్నారు. పద్మశాలి సంఘం  ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన క్యాలెండర్ 2023 పద్మశాలి సేవా సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీ కమర్తపు మురళి, గౌరవ అధ్యక్షులు  మరియు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ బాబు బాబు ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
ఈ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొన్న పాల్గొన్న గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ లింగాల కమల్ రాజుసతీసమేతంగా పాల్గొని పద్మశాలీలతో సహపంక్తి భోజనం గావించి చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఔన్నత్యాన్ని కల్పిస్తుందని ఈ సందర్భంగా పేర్కొంటూ , ఈ వన సమారాధన సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు  శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి  పాల్గొని చేతివృత్తుల్లోనే ప్రధానమైనటువంటి మనిషికి వస్త్రాలతో గౌరవ మర్యాదలు కల్పించే  చేనేత వర్గానికి చెందిన పద్మశాలీలు ఎంతో ఐకమత్యంగా వన సమారాధన చేసుకోవడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ సంఘం జిల్లా నాయకులు కమర్తపు మురళి, శ్రీనివాసబాబు, పెండెం జనార్దన్, బండారు శ్రీనివాసరావు, పాల్గొని పద్మశాలీలు అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు ఈ కార్యక్రమంలో మధిర పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.