జర్నలిస్టుల సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి

Published: Friday May 20, 2022
 టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నేతల పిలుపు.
 
మంచిర్యాల బ్యూరో, మే19, ప్రజాపాలన:
 
 
సమాజంలో మీడియా స్పేచ్చకు, జర్నలిస్టుల హక్కులకు ప్రమాదం వాటిల్లిందని, జర్నలిస్టులు ఐక్యతతో అప్రమత్తంగా ఉండి సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అద్యక్షులు మామిడి సోమయ్య ,ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య లు అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం హాజీపూర్ మండలంలోని వేంపల్లి మంచిర్యాల గార్డెన్స్ లో   జరిగిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా రెండవ మహాసభలో వారు పాల్గొని మాట్లాడారు.  మీడియా స్వేచ్ఛను, జర్నలిస్టుల హక్కులను కాపాడేందుకు పోరాటానికి జర్నలిస్టులు సిద్ధం కావాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులతో కలిసి పత్రికా స్వేచ్ఛ ను హరిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్ట్ లందరికీ ఇండ్లు ,ఇండ్ల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు.  ప్రమాదం లో మృతి చెందిన వర్కింగ్ జర్నలిస్ట్ ల కుటుంబాలకు ఇరవై లక్షల పరిహారం ఇవ్వాలని అన్నారు. అర్హులైన జర్నలిస్ట్ లందరికీ అక్రిడిటెషన్ ,హెల్త్ కార్డులు ఇచ్చి అన్ని ప్రధాన ఆసుపత్రిలలో చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఐతే
జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహిచిన జర్నలిస్టులను ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదని, ఇళ్ళస్థలాలు, హెల్త్ కార్డులు తదితర సమస్యలను పరిష్కరిస్తామని పలుమార్లు హామీ ఇచ్చిన  ముఖ్యమంత్రి కేసీఆర్ తన హామీలను గాలికొదిలేసి జర్నలిస్టులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జర్నలిస్టులను సమాయత్తం చేసి త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు ప్రకటించారు. మంచిర్యాల జిల్లాలో జర్నలిస్టుల ఫెడరేషన్ ను బలోపేతం చేసి జర్నలిస్టులకు నిరంతరం అండగా ఉండాలని అన్నారు. జిల్లా అధ్యక్షుడు తొట్ల మల్లేష్ యాదవ్ అధ్యక్షత జరిగిన ఈ మహాసభలో ఫెడరేషన్ జిల్లా నేతలు ప్రభాకర్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
 
* టీడబ్ల్యూజేఎఫ్  మంచిర్యాల జిల్లా కార్యవర్గం
 
టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా తొట్ల మల్లేష్ యాదవ్, కార్యదర్శి గా గోపతి సత్తయ్య, ఉపాధ్యక్షులు గా సబ్బతి భాస్కర్, అత్తి సాగర్, వైద్య శ్రీనివాస్,  కోశాధికారి గా  క్యాతం రాజేష్, కార్యవర్గ సభ్యులు గా బి.భాస్కర్, కోడూరి శ్రీనివాస్, గొర్రె లక్ష్మణ్, గొట్టె సురేందర్,
జాతీయ కౌన్సిల్  సభ్యుడుగా కామెర వెంకటస్వామి,  రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా మేకల ప్రభాకర్, చింతకింది మధుసూదన్, ఎం. చంద్రయ్య తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు