పేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మీ పథకం వరంలాంటిది

Published: Wednesday November 30, 2022
మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడిపల్లి, నవంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి, మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు కలిసి సుమారు 27 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణి చేశారు.
అనంతరం మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ పథకం ఒక వరమని అన్నారు. ఆడపిల్లల్ని కన్నతల్లి దండ్రుల ఆర్థిక కష్టాలను తీర్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ,
షాదీముబారక్ పథకానికి శ్రీకారం చుట్టి రాష్ట్రంలో గొప్పగా అమలు చేస్తున్నారని,పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ,అభివృద్ధి పథకాలకు రూపకల్పన చేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అమలు చేస్తూ, బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో కమీషనర్ డా. పి. రామకృష్ణ రావు, కార్పొరేటర్లు     దొంతరి హరి శంకర్ రెడ్డి, 
మద్ది యుగంధర్ రెడ్డి, భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి, అమర్ సింగ్, సుభాష్ నాయక్, బండారి మంజుల రవీందర్,లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి, అనంతరెడ్డి, అల్వాల సరిత దేవేందర్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి, నాయకులు    మాడుగుల చంద్రారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, పప్పు అంజిరెడ్డి, మున్సిపల్ అధికారులు, రెవిన్యూ అధికారులు, పట్టణ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.