బ్యాంకు డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Published: Wednesday August 24, 2022

జన్నారం, ఆగస్టు 23, ప్రజాపాలన: బ్యాంకు డిజిటల్ సేవాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ మెాహన్ రెడ్డి, అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలో ఎర్పాటు చేసిన బ్యాంకు ఖాతదారుల అవగాహన సదస్సులో అయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిజిటల్ సేవాల ఉపయోగం వల్ల బ్యాంకు కు డైరెక్ట్ రావలసిన అవసరం వుండదు, ఎక్కడ నుండియైన లావాదేవీలు జరుపుకోవచ్తు సమయమ వృదాకాదని తెలిపారు. అన్ లైన్ సంబంధించి మెాసాలు ఎర్పడినప్పుడు బ్యాంకు సిబ్బందిని నేరుగా కలసి మీ సమస్యలను నిరువృత్తం చేసుకోవాలి. అన్ లైన్ లో ఓటిపి నెంబర్ ఇవ్వడం గాని ఖాతాదారులను ఇటువంటివి ఏమి చేయవద్దని, బ్యాంకు అధికారులు ఎప్పుడు కూడా ఖాతాకు సంబంధించినవి వివరాలను పోన్ లలో అడుగరు. అన్ లైన్ సేవాలు వినియోగించడంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఈ కార్యాక్రమంలో బ్యాంకు క్యాషీయర్ సృజన్, ఎన్ సీసీ రాజమౌళి, ఉపాద్యాయులు,   ఖాతాదారులు, ప్రజలు పాల్గొన్నారు.