గోదావరి పై వంతెన ఎప్పుడు నిర్మిస్తారు : జిల్లా బీజేపీ అధ్యక్షులు

Published: Tuesday February 08, 2022
మంచిర్యాల బ్యారో, పిబ్రవరి 06, ప్రజాపాలన : ఎన్నికల ప్రచారంలో మంచిర్యాల గోదావరి నదిపై వంతెన నిర్మాణం చేపడుతానని హామీలు ఇచ్చిన కేసీఆర్ ఎప్పుడు వంతెన నిర్మాణ చెపడుతారో చెప్పాలని జిల్లా బీజేపీ అధ్యక్షులు  రఘునాథ్ వెర్రబెల్లి ప్రశ్నించారు. సోమవారం ముఖ్యమంత్రి హామీ నెరవేర్చాలని కోరుతూ జిల్లా బిజెపి అద్వార్యంలో గోదావరిలో దిగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వంతెన నిర్మాణ పనులకు125. కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాము అని తప్పుడు మాటలను చెప్పి ఇక్కడి ప్రజలను కేసీఆర్ నమ్మించాడని విమర్శించారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు  జిల్లా లోని ఇతర ఎమ్మెల్యే లు, టిఆర్ఎస్ నాయకులు కొబ్బరికాయకు కొట్టి, టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు చేసుకొన్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మునిమంద రమేష్ , అందుగుల శ్రీనివాస్, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, పెద్దపల్లి పురుషోత్తం, అందుగుల శ్రీనివాస్, మునిమంద రమేష్, కర్ణ శ్రీధర్, రజినిష్ జైన్, రేకందర్ వాణి, పట్టి వెంకట కృష్ణ, జోగుల శ్రీదేవి, బొద్దున మల్లేష్, ముదాం మల్లేష్, బొడకుంట ప్రభ, పూదరి రమేష్, బద్దరపు రాజమౌలి, కోడి రమేష్, విశ్వభర్ రెడ్డి, ఆకుల అశోక్ వర్ధన్, గాజుల ప్రభాకర్, ఈర్లా సదానందం, బోయిని దేవేందర్, అమిరిషెట్టి రాజు, పల్లే రాకేష్, పచ్చ వెంకటేశ్వర్లు, బల్ల రమేష్, పచ్చ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.