కరోనా మృతునికి అంత్యక్రియలు - మానవత్వం చాటుతున్న ఎనుగందుల రమేష్ బృందం

Published: Thursday May 20, 2021
రాయికల్, మే 19, (ప్రజాపాలన ప్రతినిధి): కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఇప్పుడు భారతదేశం అల్లాడుతుంది. ఇలాంటి విపత్కర సమయంలో కరోనా వైరస్ తో మృతి చెందిన వారికి మానవత్వంతో స్పందించి రాయికల్ పట్టణానికి చెందిన ఎనగందుల రమేష్ బృందం మేము సైతం అంటూ ముందుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఇప్పటివరకు దాదాపు 30 మృతదేహాలకు తమ స్వంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం రాయికల్ పట్టణానికి చెందిన రామానందం అను వ్యక్తి కరోనాతో మరణించగా ఎనగందుల రమేష్, రాజనాల మధు, సామల్ల సతీష్, సింగని కరుణాకర్, తాటిపాముల జ్ఞానేశ్వర్, కట్ల నర్సయ్యలు పీ పీ ఈ కిట్లు ధరించికరోనా నిబంధనలు పాటిస్తూ మృతదేహాన్ని స్మశానానికి తరలించి హిందూ సాంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.