తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే పట్టణ అభివృద్ధి --ఎమ్మేల్యే డా.సంజయ్

Published: Friday September 09, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 08 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ 48 వ వార్డ్ టి ఆర్ నగర్ లో పట్టణ ప్రగతి నిదులు 30 లక్షల తో అనిమల్ కేర్ సెంటర్ ఏర్పాటుకు భూమిపూజ చేసి, కొత్త, పాత బస్టాండ్ లలో పట్టణ ప్రగతి నిదులు 35 లక్షల్తో జంక్షన్ లను, టియుఎఫ్ఐడిసి నిదులు 4 కోట్ల 46 లక్షలతో యావర్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ ను ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ ప్రారంబించినారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ యావర్ రోడ్డులో సెంటర్ నుండి 50 ఫీట్ లతో నిర్మాణాలు చేపట్టాలని జీఓ కూడా రావడం జరిగింది అని గతంలో జీఓ లేకనే ఇష్టా రీతిన నిర్మాణాలు జరిగాయని ఇప్పుడు చట్ట బద్దంగా నూతన నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. జగిత్యాల పట్టణ అభివృద్ది రాష్ట్రం రాక ముందు రాష్ట్రం వచ్చిన తర్వాత ఏవిధంగా ఉన్నది  ఒక సారి ప్రజలు, మేదావులు అలోచన చేయాలని అన్నారు. జగిత్యాల పట్టణంలో 4 సంవత్సరాల కాలం  రహదారులు నిర్మాణం, జగిత్యాల నలువైపుల మార్కెట్ లు ఏర్పాటు, జిల్లా కేంద్రానికి మెడికల్ కాలేజ్ మంజూరు, ప్రధాన ఆసుపత్రి లో సౌకర్యాల కల్పన, వైద్యుల సంఖ్య పెరిగిందని టౌన్ హాల్ ద్వారా నేడు బల్దియా కి 15 లక్షల ఆదాయం వస్తుందన్నారు. ప్రజల సహకారం తోనే పట్టణం అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అరుణ శ్రీ, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, డి ఈ రాజేశ్వర్, కౌన్సిలర్ లు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.