జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Published: Wednesday April 12, 2023
చేవెళ్ల:(ప్రజాపాలన)
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల ను మొల్లేటి దళిత మోర్చా మండల అధ్యక్షులు అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.చేవెళ్ల మండల కేంద్రంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి బిజెపి నాయకులు పూలమాలలు వేసి మహానీయుడు జ్యోతిరావు పూలే కు ఘనంగా నివాళులు అర్పించారు. 
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు కంచర్ల ప్రకాష్ మాట్లాడుతూ......
మహాత్మా జ్యోతిరావ్ ఫూలే మహారాష్ట్రలోని పూణేలో,1873 సెప్టెంబరు 24లో స్థాపించిన సాంఘిక సంస్కరణ సమాజము అణగారిన వర్గాల వారికి, శూద్రులకు,దళితులకు,ముఖ్యంగా మహిళలకు విద్య,సాంఘిక హక్కులు,రాజకీయ చైతన్యం కలిగించడమే ఈ సమాజము యొక్క ముఖ్య ఉద్దేశం.జ్యోతీరావు పూలే సతీమణి సావిత్రి బాయి పూలే మహిళా సమాజ విభాగానికి నాయకత్వం వహించేవారని అన్నారు.జ్యోతిరావు పూలే జీవిత దేశ ప్రజలకు ఆదర్శం అని అన్నారు.తదుపరి కాలంలో డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్,పూలే లను ఆదర్శంగా తీసుకుని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి  చేసింది అన్నారు 
ఈ కార్యక్రమంలో బిజెపి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జంగారెడ్డి.చేవెళ్ల బిజెపి మండల అధ్యక్షుడుదేవర పాండురంగారెడ్డి.ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు చీర శ్రీనివాస్.జిల్లా కార్యదర్శి వెంకటరెడ్డి.జిల్లా నాయకులు శ్రీనివాస్.కుంచం శ్రీనివాస్.బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అల్లాడ శ్రీనివాస్ రెడ్డి.మండల ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి.మండల ఉపాధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి.శేర్వలింగం.బీజేవైఎం మండల అధ్యక్షులు పత్తి సత్యనారాయణ.బీజేవైఎం టౌన్ అధ్యక్షులు బండారి శేఖర్ రెడ్డి.బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు కృష్ణమోహన్.బిజెపి టౌన్ అధ్యక్షులు గాజులగూడం శ్రీనివాస్ రెడ్డి.బిజెపి మండల నాయకులు ఆలూరు కృష్ణ.గోపాల్.మల్ రెడ్డి.చాకలి మల్లేష్.చాకలి శ్రీనివాస్.బీజేవైఎం నాయకులు జయసింహారెడ్డి.వడ్డే గణేష్.చేవెళ్ల అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సున్నపు ప్రవీణ్.అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.