చెత్త సేకరణకు చర్యలు

Published: Friday May 28, 2021
పరిగి, 27 మే ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ నందు తడి పొడి చెత్త సేకరణలో ప్రతి వార్డ్ కు బాధ్యతలు అప్పగించినట్లు సర్పంచుల సంఘo అధ్యక్షులు రాజిరెడ్డి అన్నారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ లో ఎంపికైనందున ప్రతి ఇంటి నుంచి రోజు తడి పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని కోరుతుండగా కొందరు నిర్లక్ష్యం తో ఒకే దగ్గర చెత్తను ఇవ్వడం పట్ల పై అధికారుల ఆదేశాలతో గురువారం దోమ గ్రామ పంచాయతీలో అంగన్వాడీ. మహిళసంఘం. పంచాయతీ పాలక వర్గం వారితో సమావేశం నిర్వహించి వేరు చెత్త ఇవ్వని 240 ఇళ్ల వివరాలు 7. గురికి బాధ్యతలు ఇచమన్నారు. వారికీ సర్పంచ్ మరియు వార్డుల వారీగా సభ్యులు సహకారం ఇవ్వాలని ఎంపీవో సురేష్ చెప్పారు. పది రోజుల్లో రీచ్ కావాలని సూచంచారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యాదర్శి చెంద్రశేఖర్ ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్ వార్డ్ సభ్యులు లక్ష్మణ్. వసంతరావు. రమేష్ అంజిలమ్మ అరిషియా. తదితరులు పాల్గొన్నారు.