మర్పల్లి ఎంపిడిఓ కార్యాలయం ఆకస్మిక తనిఖీ : సిఈఓ జానకి రెడ్డి

Published: Thursday December 02, 2021
వికారాబాద్ బ్యూరో 01 డిసెంబర్ ప్రజాపాలన : సాధారణ నిధి క్యాష్ బుక్ 15వ ఫైనాన్స్ ఎస్ఎఫ్సి, సిఎఫ్సి ఆర్థిక నిధుల రిజిష్టర్లను తనిఖీ చేశానని సీఈవో జానకి రెడ్డి తెలిపారు. బుధవారం మర్పల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్పల్లి మండల పరిధిలో అభివృద్ధి పనుల గురించి ఎంపిడిఓ వెంకట్ రామ్ గౌడ్ ను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సిఈఓ కార్యాలయం సిబ్బంది ఖాళీల వివరాలు ఎంపిడిఓ ను అడుగగా ఒక నైట్ వాచ్మెన్ పదవి ఖాళీగా ఉన్నదని బదులిచ్చారు. ఒక్కడే సబార్డినేట్ ఉండడం వలన జనరల్ బాడీ సమావేశం ఏర్పాట్లకు, ఇతర కార్యాలయం అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. కొత్తగా నియామకం అయినప్పుడు మర్పల్లి మండల పరిషత్ కు కేటాయిస్తామని తెలిపారు. అన్నతరం కొంశెట్ పల్లి నర్సరీని ఎంపీడీఓ వెంకట్ రామ్ గౌడ్ సందర్శించారు. 2000 బ్యాగ్ ఫిల్లింగ్ పనులు పూర్తి అయినవని కార్యదర్శి తెలపారని ఎంపిడిఓ అన్నారు.15000 టార్గెట్ ఈ సంవత్సరం పూర్తి చేయాలని అదేశించారు. రెండు రోజుల్లో 15 వేల బ్యాగ్ ఫిల్లింగ్ పనులు పూర్తి కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎపిఓ అంజి రెడ్డి, నాయకులు రఫి, ఈసీ విఠల్ రావు, టెక్నికల్ అసిస్టెంట్ విష్ణు, వెంకటేష్, అశోక్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.