సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Published: Wednesday July 14, 2021
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జూలై 13 ప్రజాపాలన బ్యూరో : పల్లె, పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలు, పట్టణాలు చాలా వరకు శుభ్రం చేసుకోవడం జరిగిందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోలని సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాలలో మురుగు నీరు నిలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీరు నిల్వ ఉండటం వల్ల దోమల వృధి ఎక్కువగా ఉంటుందన్నారు. తప్పనిసరిగా ప్రజలందరూ కాచి వడపోసిన  నీటిని తాగాలన్నారు. ఈ సీజన్ లో ప్రజలు వర్షం నీటిలో తడవకుండా జాగ్రత్త వహించాలి మరియు ఏవైనా అనారోగ్య లక్షణాలు కనబడితే వైద్యుల సలహాలు, సూచనలు  పాటించాలన్నారు. ప్రభుత్వం వైద్యపరీక్షల కోసం ప్రజల పై భారం పడకుండా ముందుగానే మన జిల్లా కేంద్రంలో డయాగ్నొస్టిక్ సెంటర్ ను ప్రారంభించిందని గుర్తు చేశారు. అన్ని రకాల సీజనల్ వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఫీవర్ సర్వే రెండో భాగం నిర్వహించి ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తుందన్నారు. ప్రజలు కలుషితమైన ఆహారాన్ని, నీటిని తీసుకోరాదని హితవు పలికారు.