ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన సనత్ నగర్ కార్పొరేటర్.

Published: Thursday September 02, 2021
అమీర్ పేట్, సెప్టెంబర్ 01, ప్రజాపాలన ప్రతినిధి : ఏడాదిన్నర తరువాత తెరుచుకున్న బడులలో వసతులు అన్ని ఉండేలా చేసుకోవాలన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశం మేరకు బుధవారం సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి  అశోక్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. మళ్ళీ పాఠశాలలు తెరచుకున్న సందర్భంలో పిల్లల కు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా శానిటైజేషన్ మొదలుకొని తరగతి గదుల పరిశుభ్రత లాంటి అన్ని  వసతులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి వి రెడ్డి, శ్రీనివాస్, కిరణ్ మరియు ఫజల్ అహ్మద్ బీ (ఉర్దూ మీడియం) పాఠశాలలో జరిపించాల్సిన మరమ్మతుల వివరాల వినతి పత్రాన్ని కార్పొరేటర్ కి అందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి మాట్లాడుతూ మరమ్మత్తుల విషయాలను మంత్రి తలసాని దృష్టికి తీసుకెళ్లి పనులను త్వరితగతిన పూర్తిచేయిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస డివిజన్ అధ్యక్షులు కొలను బాలరెడ్డి, సరఫ్ సంతోష్, ఖలీల్ బేగ్, జి.రాజు, ఇబ్రహీం, పురుషోత్తం, సురేందర్, పద్మ, రుక్మిణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.