ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన నుండి పుట్టిందే కంటి వెలుగు --జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ద

Published: Friday January 20, 2023

జగిత్యాల, జనవరి 19 (ప్రజాపాలన ప్రతినిధి): జిల్లా కథలపూర్ మండల తక్కలపెల్లి, దూలూరు గ్రామాలలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్  ప్రారంభించారు.ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్  మాట్లాడుతూ మానవ శరీరంలో అన్నిటి కంటే ప్రధానమని తెలిసి కూడా కంటి చూపు పట్ల నిర్లక్ష్యం వహిస్తూ శాశ్వతంగా చూపు కోల్పోతున్న లక్షలాది మందిని చైతన్యపరిచి అదుకోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్  ఆలోచనల నుండి పుట్టినదే కంటి వెలుగు కార్యక్రమం అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ప్రపంచంలోనే ఎక్కడా లేదన్నారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. కంటి వెలుగు పథకం దేశానికి ఆదర్శం అని, కంటి వెలుగు కోసం ప్రభుత్వం 250 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. ఆరోగ్య శాఖ చేస్తున్న కంటి వెలుగు ఉద్యమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కథలాపూర్ మండల జడ్పిటిసి నాగం భూమయ్య, ఎంపీపీ జవ్వాజి రేవతి గణేష్, వైస్ ఎంపీపీ గండ్ర కిరణ్ రావు, మండల రైతు బంధు సమితి నాయకులు విద్యాసాగర్ రావు మండల కోఆప్షన్ రఫీ, సర్పంచులు మొలిగే లక్ష్మీ శ్రీనివాస్, దయ్య లక్ష్మీ నర్సయ్య, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు మిట్ట పెల్లి గంగ రెడ్డి, ఎంపీటీసీలు జిల్లా లక్ష్మీ, నక్క లక్ష్మీ నగరాజ్, సిరికొండ ప్యాక్స్ చైర్మన్ చుక్క దేవరాజం, భూషణ్ రావు పేట్ ప్యాక్స్ వైస్ చైర్మన్ మిట్ట పెల్లి లక్ష్మీ గంగ రెడ్డి, డైరెక్టర్లు గుండారపు గంగదర్, వసంత నరేంధర్, మేడి పెల్లి రాజ రెడ్డి,నాయకులు వెగ్యరపు శ్రీరాములు, ఆది రెడ్డి, ఎమ్ డి ఇర్ఫాన్, నల్ల గంగధర్, మిట్టపెల్లి శ్రీనివాస్, గడ్డం అరుణ్ , పడల భూమేష్, ఆర్డిఓ వినోద్ కుమార్, మండల స్పెషల్ ఆఫీసర్ డిఎఫ్ఓ వెంకటేశ్వర్లు, ఎంపిడిఒ జనార్ధన్, నాయకులు, అధికారులు, ఆశా వర్కర్లు, ఎఎన్ ఎమ్ లు పాల్గొన్నారు.